ఆకు కూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. దీన్నే చెన్నగంటి కూర అని కూడా అంటారు. ఈ ఆకు కూర భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా ఒక్కటి ఏంటి.. చాలా రకాల పోషకాలు ఉంటాయి. పొన్నగంటి కూర తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. చాలా మంది ఎక్కువగా పాల కూర, తోట కూర, గోంగూర తింటూ ఉంటారు. పొన్న గంటి కూరను కూడా వారంలో ఒక్కసారి మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే.. ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఈ కూర ఏడాది పొడవునా కూడా లభిస్తుంది. మరి పొన్నగంటి కూర తింటే ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా మంచి శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆకు కూరలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ ఆకు కూర సంవత్సరం పొడవునా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఆకు కూర పొలాల గట్ల వెంట సహజసిద్ధంగా పెరుగుతుంది. పొన్నగంటి కూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాదు, అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, ఐరన్,ఫైబర్, క్యాలిష్యం, విటమిన్ ఎ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.
పొన్నగంటి కూర మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించి తింటే ఎంతో రుచిగా వుంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకు కూరను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వారంలో మూడుసార్లు ఈ కూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుని అన్నంలో కలుపుకుని కూడా తినొచ్చు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తల నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుకూరను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
వెయిట్ లాస్: పొన్నగంటి కూర తింటే త్వరగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండుతుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
రోగ నిరోధక శక్తి మెండు: పొన్నగంటి కూర తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది మెండుగా లభిస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రెండూ లభిస్తాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో త్వరగా రోగాల బారిన పడకుంటా ఉంటారు. వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
రక్త హీనత తగ్గుతుంది: పొన్నగంటి కూరలో ఐరన్ కంటెంట్ అనేది అధికంగా లభిస్తుంది. కాబట్టి ఈ కూర తినడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. రక్తం లేని వారు ఈ ఆకు కూరతో తయారు చేసే ఆహారాలు తింటే మంచి రిజల్ట్ ఉంటుంది.
డయాబెటీస్‌ను కంట్రోల్ చేస్తుంది: షుగర్ వ్యాధి ఉన్నవారు అన్నీ తినలేరు. కానీ పొన్నగంటి కూరను తినవచ్చు. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది తింటే షుగర్ లెవల్స్ బాగా కంట్రోల్ అవుతాయి.
మొటిమలు..మచ్చలు మాయం: ఈ ఆకు రసంను తీసుకొని ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు వెంటనే తొలగిపోతాయి.. చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది.. ఇకపోతే వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
చర్మానికి మేలు: పొన్నగంటి కూరలో విటమిన్లు అనేవి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇది తింటే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో పొన్నగంటి కూర సహాయ పడుతుంది.
క్యాన్సర్ వ్యాధిని నియంత్రిస్తుంది: పొన్నగంటి కూరలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఈ ఆకు కూర తింటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు
జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారిస్తుంది:పొన్నగంటి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు, టాన్సిలిటిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:పొన్నగంటి ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది:పొన్నగంటి ఆకుల్లో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి
కంటి ఆరోగ్యానికి మంచిది: పొన్నగంటి కూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఇది రాత్రి కురుపు వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది : పొన్నగంటి కూరను తింటే పురుషులకు కావల్సిన శక్తి సమకూరుతుంది. ఈ కూర వారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తాజా రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలింగా వేధించే దగ్గు, ఆస్తమా తగ్గుతాయి. నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
సన్నగా ఉండేవారికి వరం : కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే సన్నగా ఉండేవారు బరువు పెరుగుతారు. అలాగే ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. కంటి కలకలు, కురుపులతో బాధపడేవారు కూడా పొన్నగంటి కూర తాజా ఆకులను కళ్లమీద కొంచెం సమయం ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది. వెన్ను నొప్పికి ఇది చక్కగా పనిచేస్తుంది. నరాల్లో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది