హైదరాబాద్, వెలుగు: జాతీయ న్యాయసేవాధికార సంస్థ సూచనలతో తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ, ఉస్మానియా ఆస్పత్రి, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే శుక్రవారం ప్రారంభించారు. న్యాయవాదులు, హైకోర్టు సిబ్బందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజయ్‌పాల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో పాటు పలువురు జడ్జీలు, న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, బార్ కౌన్సిల్ చైర్మన్‌నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడురవీందర్‌రెడ్డి, ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ కుమార్ సహాయ్, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ సీఈవో మయూర్ పట్నాల తదితరులు పాల్గొన్నారు.