చొప్పదండి, వెలుగు: చొప్పదండిలోని పలు వార్డుల్లో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్న నేపథ్యంలో ‘వెలుగు’లో సోమవారం పబ్లిష్ అయిన వార్తకు మున్సిపల్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించారు. సోమవారం పట్టణంలోని 13వ వార్డులో హెల్త్క్యాంపు నిర్వహించారు. జ్వర బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వారిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. శానిటేషన్ సిబ్బంది డ్రైనేజీలను క్లీన్ చేసి బ్లీచింగ్ చల్లారు. కార్యక్రమంలో మున్సిపల్మేనేజర్ ప్రశాంత్, జూనియర్అసిస్టెంట్శ్రీధర్రెడ్డి, పీహెచ్‌సీ సీహెచ్‌వో వెంకటస్వామి, హెల్త్ సూపర్వైజర్ శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.