![చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు, భీమా స్కీం అమలు చేయాలి](https://static.v6velugu.com/uploads/2021/07/Health-cards-for-handloom-workers,-insurance-scheme-should-be-implemented-says-Kodandaram_1jdNt97WHy.jpg)
చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు, భీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. మగ్గమే ఆయుధంగా మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నేతన్నల జాతీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో నేతన్నల పరిస్థితి దారుణంగా ఉందన్నారు YSR తెలంగాణ పార్టీ నేత ఇందిరా శోభన్. దళిత బంధు స్కీం పక్కా ఎలక్షన్ స్టంటే అన్నారు. చేనేత కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారన్నారు నేతన్నల జాతీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్. నేతన్నల సమస్యలు పరిష్కరించకపోతే హుజురాబాద్ లో TRSని ఓడిస్తామన్నారు.