మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్.. ఉచితంగా అందిస్తున్న వారికి కృతజ్ఞతలు: మంచు విష్ణు

మా సభ్యులకు ఫ్రీ హెల్త్  చెకప్.. ఉచితంగా అందిస్తున్న వారికి కృతజ్ఞతలు: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)  సభ్యులందరికీ  ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌‌‌‌‌‌‌‌ను ఆదివారం నిర్వహించారు. ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు,  వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌‌‌‌‌‌‌‌ను జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  ‘మా’ సభ్యులంతా పాల్గొన్నారు.

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Vishnu Manchu) మాట్లాడుతూ ‘డా.శాస్త్రిగారికి, జీవీకే హెల్త్‌ హబ్‌కు ‘మా’ తరఫున కృతజ్ఞతలు. వేల ఖర్చుతో కూడుకున్న హెల్త్‌ చెకప్‌ను ఉచితంగా అందించడం సామాన్యమైన విషయం కాదు. ఉదయం 7గంటల నుంచి ఎంతో ఓర్పుతో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. వీరి సేవాకార్యక్రమాలు ఇకపై కూడా ఇలాగే సాగాలని ఆశిస్తున్నా’ అన్నారు.

ఈ సందర్భంగా డా.శాస్త్రితో పాటు జీవీకే హెల్త్ హబ్‌‌‌‌‌‌‌‌కు మంచు విష్ణు థ్యాంక్స్ చెప్పారు.  ఇది ‘మా’ ఆధ్వర్యంలో నాలుగో హెల్త్ క్యాంప్ అని మాదాల రవి, శివ బాలాజీ అన్నారు. 

‘కన్నప్ప’ సినిమాకి సంబంధించి ఓ భారీ వేడుకని  శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్నామని, ఆ వేడుకకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించినట్టు తెలిపారు మంచు విష్ణు. కన్నప్ప చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివరలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.