డాక్టర్స్ కాలనీలో వైద్యారోగ్యశాఖ తనిఖీలు

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసర్లు గురువారం తనిఖీలు నిర్వహించారు. మల్టీ స్పెషాలిటీ, జనరల్, గైనిక్ ఆస్పత్రులు సహా ఇతర ప్రైవేట్ ల్యాబ్స్, ఫిజియో థెరపీ సెంటర్ల ను సందర్శించారు. రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్న మూడు ఆస్పత్రులతో పాటు రెండు ఎక్స్ రే ల్యాబ్స్, ఓ ఫిజియో థెరపీ సెంటర్ ను సీజ్ చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్​ఓ అనిమల కొండల్ రావు, డీఎం వో రవి శంకర్, డిప్యూటీ డిఎంహెచ్ వో రవితో మాట్లాడారు. పర్మనెంట్ డాక్టర్, కంప్లీట్ స్టాఫ్ లేకుండానే ఆస్పత్రులు నడుపుతున్నారని, నవీన ఆసుపత్రిలో ల్యాబ్, ఐసీయూ విభాగాలను సీజ్ చేసినట్లు చెప్పారు.

కిన్నెర, అనిత, సేఫ్ హాస్పిటల్స్ తో పాటు ల్యాబ్స్, ఎక్స్ రే కు గుర్తింపు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, దామరచర్ల పీహెచ్ సీ డాక్టర్లు అలుగుబెల్లి జగన్ రెడ్డి, అడావత్ నాగేశ్వర రావు ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధుల్లో ఉండకుండా.. తమ ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించడంపై డీఎంహెచ్ ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో హెచ్ ఈవో లు ప్రభాకర్, వాసు దేవరెడ్డి ఉన్నారు.