డీహెచ్‌‌‌‌ ఆఫీసులో డెంగీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన మంత్రి దామోదర

డీహెచ్‌‌‌‌ ఆఫీసులో డెంగీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డెంగీ, విష జ్వరాల కట్టడిపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో హెల్త్  మినిస్టర్  దామోదర రాజనర్సింహా మంగళవారం సమీక్షించారు. సెక్రటేరియట్‌‌‌‌లో జరిగిన ఈ సమీక్షలో హెల్త్  సెక్రటరీ క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, డీఎంఈ వాణి, టీజీఎంఎస్‌‌‌‌ఐడీసీ ఎండీ హేమంత్  పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డెంగీ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

 పబ్లిక్  హెల్త్ డైరెక్టర్  ఆఫీసులో కంట్రోల్  రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న సీజనల్  వ్యాధుల బాధితుల వివరాలను కంట్రోల్  రూంకు తెలియజేసేలా హాస్పిటళ్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా కంట్రోల్  రూం నుంచి సూచనలు చేయాలని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులంతా జిల్లాల్లో పర్యటించాలని, జ్వరాలపై రివ్యూ చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.