నిర్మల్​లో నర్సింగ్​ కాలేజీ ప్రారంభం

నిర్మల్​లో నర్సింగ్​ కాలేజీ ప్రారంభం

నిర్మల్, వెలుగు: ప్రజాపాలన, ప్రజా విజయోత్స వాల్లో భాగంగా సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కాలేజీలో ఆరోగ్య ఉత్సవాలు నిర్వహించారు. వర్చువల్ విధానంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క 

ప్రారంభించారు. స్థానికంగా జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ అభిలాష అభినవ్​ లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నర్సింగ్ ​కాలేజీతో వైద్య సేవలు మరింత విస్తృతమవుతా యని అన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 

నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసినందుకు విద్యార్థులు సీఎం రేవంత్​కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శకుంతల, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, ఎన్ఎంసీ నోడల్ అధికారి సునీల్, తహసీల్దార్ రాజు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, పంచాయితీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్, ఇతర అధికారులు, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.