హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య బీమా కంపెనీ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ తన కొత్త ఆరోగ్య బీమా ఆఫర్ ‘మణిపాల్ సిగ్నా సర్వా’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఒక సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తుంది.
ఈ పాలసీ హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, స్ట్రోక్, అవయవ మార్పిడి వంటి ప్రధాన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన హాస్పిటల్లో చేరడానికి సంబంధించిన ఖర్చులను కవర్ చేస్తుంది. క్లెయిమ్ చేసినా చేయకపోయినా, బేస్ సమ్ ఇన్సూర్డ్పై 10 రెట్ల బోనస్ ఇస్తారు.
ప్రతి ఏడాది వెయ్యి శాతం వరకు గరిష్టంగా సమ్ ఇన్సూర్డ్లో వందశాతం పెరుగుదల ఉంటుంది. పాలసీ ప్రారంభమైన 31వ రోజు నుంచి ఉన్న ముందస్తు వ్యాధులకు కవరేజ్ వర్తిస్తుంది. రూ. 3 కోట్ల వరకు కుటుంబాన్ని రక్షించే సమగ్ర వ్యక్తిగత ప్రమాద కవరేజ్ కూడా వర్తిస్తుంది.