
న్యూఢిల్లీ: ప్రతీ అభివృద్ధి చెందుతున్న సమాజానికి మంచి ఆరోగ్యమే పునాది అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ‘ఎక్స్’లో ప్రధాని మోదీ తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆరోగ్య సంరక్షణపై తమ ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తుందని, ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన వివిధ అంశాలలో పెట్టుబడులు పెడుతుందని తెలిపారు. ‘‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడంలో మన నిబద్ధతను పునరుద్ఘాటించుకుందాం’’ అని ఆయన పేర్కొన్నారు.