వేడినీళ్లతో ఎంతో మంచిది

రోజూ తాగే నీళ్లను గోరువెచ్చని నీళ్లకు మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారట. అచ్చంగా ఫ్రిజ్ వాటర్ తాగేవాళ్లు ఆ అలవాటు మానుకోవడం ద్వారా చాలా సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. గోరువెచ్చని నీళ్లను తాగేవాళ్లలో అజీర్ణ సమస్యలు, తలనొప్పి లాంటివి ఉండవు. పొట్ట సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. అలాగే శొంఠిపొడి కలిపిన వేడినీటిని అప్పుడప్పుడు తాగితే వాత సంబంధిత సమస్యలకు చెక్‌‌ పెట్టొచ్చు.

తిన్న తర్వాత  ఒక గ్లాసు వేడినీళ్లు  తాగితే.. శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. భోజనానికి అరగంట ముందు వేడినీళ్లు తాగితే బరువు తగ్గొచ్చు. అలాగే చర్మానికి కూడా వేడినీళ్లు ఎంతో మేలు చేస్తుంది. అందుకే చల్లటినీళ్లకు బదులు వేడినీళ్లను ప్రిఫర్ చేయడం బెటర్.

see also: పెండ్లికి కట్నంగా 100 పుస్తకాలు

కరీంనగర్లో అర్ధరాత్రి ఓటర్లకు డబ్బుల పంపకం

రోజుకు లక్ష మంది.. ముందే మొక్కులు చెల్లిస్తున్రు