
పద్మారావునగర్, వెలుగు: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఇటీవల గాంధీ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా 27 మంది డాక్టర్లు గైర్హాజరు అయినట్టు గుర్తించామని, ఇందులో సమాచారం ఇవ్వకుండా ఆబ్సెంట్అయిన 15 మందికి షోకాజ్‌నోటీసులు ఇచ్చామని డీఎంఈ (డైరెక్టరేట్ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) డా.నరేంద్రకుమార్తెలిపారు. సదరు డాక్టర్లపై పూర్తి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం ఆయన గాంధీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
క్యాజువాలిటీ, ఓపీ వార్డు, రేడియాలజీ డిపార్ట్ మెంట్ వార్డులను పరిశీలించారు. అటెండెన్స్‌ను బయోమెట్రిక్పద్ధతిలో తీసుకుంటున్నామని తెలిపారు. గాంధీలో ప్రస్తుతం ఐయూఐ పద్ధతిలో సంతాన సాఫల్య కేంద్రం సేవలు అందిస్తున్నామని వివరించారు. జీరియాట్రిక్వార్డు నడుస్తుందన్నారు.దవాఖాన ఆవరణలో మురుగు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.