అవసరం లేకున్నా.. సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ

అవసరం లేకున్నా..  సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి

హైదరాబాద్, వెలుగు: సరైన కారణం లేకుండా సిజేరియన్లు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సీ-సెక్షన్ ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్యను మరింత పెంచాలని, నార్మల్ డెలివరీ వల్ల కలిగే లాభాలను, సీసెక్షన్ వల్ల జరిగే నష్టాలను యాంటి నాటల్ చెకప్స్ సమయం నుంచే గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు వివరించాలన్నారు. గురువారం హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి పలు అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 

మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో వసతులను మెరుగుపర్చాలన్నారు. ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. గతేడాది 8 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 6,200లకు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇందులో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయని వివరించారు. ఈ పోస్టులన్నింటికీ రాత పరీక్షలు పూర్తి కాగా, వెంటనే ఫలితాలు విడుదల చేసి, నెల రోజుల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందికి సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు మంత్రి సూచించారు.