వర్గీకరణను అడ్డుకునే కుట్రలు సాగవు : దామోదర రాజనర్సింహ

వర్గీకరణను అడ్డుకునే కుట్రలు సాగవు : దామోదర రాజనర్సింహ
  • న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకెళ్తున్నాం

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ -వర్గీకరణ జరగడం ఇష్టంలేని వ్యక్తులు, వర్గీకరణ పేరిట మనుగడ సాగించాలనుకునే వారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని హెల్త్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దామోదర రాజనర్సింహ అన్నారు. వర్గీకరణను అడ్డుకునే కుట్రలు సాగవన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారిలా తాను చిల్లర మాటలు, బట్టేబాజ్ మాటలు మాట్లాడి జాతిని మోసం చేసే వ్యక్తిని కాదన్నారు. తనది ఎవ్వరికీ భయపడే తత్వం కాదని, వర్గీకరణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన మాల, మాదిగల నడుమ వివాదాలు, న్యాయపరమైన చిక్కులు సృష్టించి వర్గీకరణ‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 

గురువారం మినిస్టర్స్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మంత్రి దామోదర రాజనర్సింహను మాదిగ, మాదిగ ఉప కులాల నాయకులు, ప్రజలు కలిసి ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో అందరికి సమాన హక్కులు, సమన్యాయం దక్కాలన్నదే కాంగ్రెస్ పార్టీ కమిట్‌‌‌‌‌‌‌‌మెంట్ అని, ఆ కమిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో‌‌‌‌‌‌‌‌నే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని ఎన్నికలకు ముందే చెప్పామని, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా చేవెళ్ల డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌లో వర్గీకరణ‌‌‌‌‌‌‌‌పై ప్రకటన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వర్గీకరణ అంశం ఇప్పటికే ఆలస్యమైందని, అన్యాయం జరగొద్దన్న ఉద్దేశంతో వీలైనంత త్వరగా తీసుకున్నామన్నారు.