- మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో సోమవారం జరిగిన ఆరోగ్య ఉత్సవంలో మంత్రి మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. కాగా, రూ. 2 వేల కోట్లతో కొత్త ఉస్మానియా దవాఖానాకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని సెక్రటేరియెట్‌లో మంత్రి వెల్లడించారు.
ఆరోగ్యకరంగా తెలంగాణ: మంత్రి పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నియామకాలు, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలతో భవిష్యత్తులో తెలంగాణ మరింత ఆరోగ్యకరంగా మారుతుందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా.. ప్రజలు కూడా వ్యక్తిగతంగా ఆరోగ్య అలవాట్లు పాటించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల– రూ.10 లక్షలకు పెంచామని వివరించారు.