10 కిలోమీటర్లకో పీహెచ్​సీ : దామోదర రాజనర్సింహ

10 కిలోమీటర్లకో పీహెచ్​సీ : దామోదర రాజనర్సింహ
  • మంత్రి దామోదర రాజనర్సింహ

రేగోడ్, వట్​పల్లి, వెలుగు: రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం వట్​పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీ సురేశ్ శెట్కార్ తో  కలిసి పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ కొత్త  చైర్మన్ గా కొప్పుల లక్ష్మి శేషారెడ్డి, వైస్ చైర్మన్ గా మన్నె ఈశ్వరయ్య, పాలకవర్గం సభ్యులు  చిన్నెల్లి పాపయ్య, దేవసోత్ రాజు, మహమ్మద్ అబ్దుల్ ఫాజిల్, మద్దూరి రాజు గౌడ్, కుమ్మరి సాయిలు, బాపోళ్ల దిగంబర్ రావు, సయ్యద్ హబీబుద్దీన్, పట్లోళ్ల బాద్రా రెడ్డి, గంజి సంగమేశ్వర్, చాకలి లక్ష్మయ్య, పెద్దగొల్ల నాగయ్య, కల్లెటి శ్రీధర్ తో  ప్రమాణ స్వీకారం చేయించారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వట్​పల్లికి మార్కెట్ కమిటీ కాంగ్రెస్ హయాంలోనే మంజూరైందని అప్పటి నుంచి ఈ ప్రాంతానికి మహర్దశ వచ్చిందన్నారు. భవిష్యత్​లో చుట్టుపక్కల మండలాలకు వట్​పల్లి తలమాణికంగా  ఉండబోతుందన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యం సౌకర్యంగా అందించేందుకు వట్​పల్లి మండల కేంద్రంలో రూ.12 కోట్లతో 30 పడకల ఆస్పత్రిని మంజూరు చేశామని, 10 కిలోమీటర్లకు ఒక పీహెచ్​సీ, 5 కిలోమీటర్లకు ఒక సబ్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రూ.152 కోట్లతో ఆర్ అండ్ నిధులు, రూ.50  కోట్ల పంచాయతీరాజ్ నిధుల మంజూరుతో నియోజకవర్గంలోని రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వట్​పల్లి మండల అధ్యక్షుడు రమేశ్ జోషి,  జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, సుధాకర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంగమేశ్వర పాటిల్, మాజీ జడ్పీటీసీలు యాదగిరి, మల్లికార్జున్ పాటిల్, రేగోడు మండల ప్రెసిడెంట్ దిగంబర్ రావు, పీసీసీ మెంబర్​ కిషన్, మాజీ ఎంపీపీ పత్రి విట్టల్, నాయకులు సంగమేశ్వర్ పాటిల్, మన్నే నరేందర్, రాజేందర్ పాటిల్, చోటు మియా పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

జోగిపేట: ఆందోల్​లో కొత్తగా మంజూరైన నర్సింగ్ కాలేజీ పనులను,  కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్​లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి దామోదర​రాజనర్సింహ  అధికారులతో  కలిసి పరిశీలించారు. గురుకుల స్కూల్​లో ఈ నెల 11 నుంచి 14 వరకు జరిగే జోన్​ లెవల్ స్పోర్ట్స్ మీట్ కి సంబంధించి  మైదానంలో  కొనసాగుతున్న పనులను  పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఆయన వెంట ఆర్డీవో పాండు, ఇతర అధికారులు ఉన్నారు.