- వైద్యం పేరుతో కొందరు వ్యాపారం చేస్తున్నరు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి, పారదర్శకత, జవాబుదారితనంతో కూడిన సేవలను ప్రజలకు అందించడానికి వేర్వేరుగా కమిటీలను నియమిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు. ఈ మేరకు గురువారం సెక్రటేరియట్‌లో కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని మంత్రి వారికి సూచించారు. కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు వైద్యం పేరుతో వ్యాపారాలు చేస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదు అని మంత్రి అసంతృ ప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయాలని మంత్రికి హాస్పిటళ్ల యజమానులు విజ్ఞప్తి చేశారు.