బ్లడ్ బ్యాంకులు బలోపేతం చేస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ 

బ్లడ్ బ్యాంకులు బలోపేతం చేస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ 

రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తామన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఐపీఎం సేవలను ఆధునీకరిస్తామని చెప్పారు. బ్లడ్ బ్యాంకులు రక్తం నిల్వలను పెంచుకోవాలని సూచించారు. బ్లడ్ బ్యాంకుల నిర్వహణ, బలోపేతంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి. జూన్ 14న ప్రపంచ రక్తదానం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రంల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి రాజనర్సింహ.