బస్తీ దవాఖానాలను ప్రారంభించిన మంత్రి ఈటెల

బస్తీ దవాఖానాలను ప్రారంభించిన మంత్రి ఈటెల

పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హైదరాబాద్‌లో మరో 24 బస్తీ దవాఖానాలను ప్రారంభించింది. అందులో భాగంగా.. ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానందా, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. నగరంలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా 200 బస్తీ దవాఖానాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. వాటికి తోడుగా నేడు మరో 24 బస్తీ దవాఖానలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.

For More News..

కొత్త సంవత్సరంలో పాత వాహనాలుండవు

రాష్ట్రంలో మరో 1,015 కరోనా కేసులు

కంటిచూపు పోగొట్టినందుకు దవాఖానకు 3 లక్షల పెనాల్టీ