- డాక్టర్ ను సస్పెండ్ చేసిన మంత్రి హరీష్ రావు
- సర్టిఫికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేశారని బాధితుల ఫిర్యాదు
- కొండాపూర్ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి
హైదరాబాద్ : ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శంచారు. ఈ క్రమంలోనే లంచం డిమాండ్ చేసిన ఓ డాక్టర్ నిర్వాకం బయటపడింది. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం మూర్తి అనే డాక్టర్ డబ్బులు అడిగారని బాధితులు మంత్రి హరీష్ రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో వివరాలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు డాక్టర్ మూర్తిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటివి సంఘటనలు మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022
వైద్యులకు, వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు పలు సూచనలు చేశారు. గైనకాలజీ వార్డులో ప్రతి రోజూ స్కానింగ్ నిర్వహించాలన్నారు. ఆస్పత్రికి అదనంగా రెండు అల్ట్రాసౌండ్ మెషన్లను పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. గైనకాలజీ వార్డులో సదుపాయాలను పరిశీలించారు. 60శాతానికి పైగా నార్మల్ డెలివరీలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను, వారి సహాయకులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
మంత్రి @trsharish గారు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. pic.twitter.com/pVfy3Dm1ce
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022
https://twitter.com/TelanganaHealth/status/1528621516396843008
మరిన్ని వార్తల కోసం..
దళితుడు నోట్లోని ఆహారాన్ని తీయించి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే