ఇవాళ కామారెడ్డిలో హరీష్ రావు పర్యటన.. ముందుస్తుగా అరెస్ట్ లు

కామారెడ్డి జిల్లా : ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

మరోవైపు.. మంత్రి హరీష్ రావు పర్యటన దృష్ట్యా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు, బీజేపీకార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.