దాడి జరిగితే..6 గంటల్లోపే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: కేంద్ర ఆరోగ్య శాఖ

దాడి జరిగితే..6 గంటల్లోపే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులతో అప్రమత్తమైంది. డాక్టర్లు, సిబ్బందిపై దాడి జరిగిన ఆరు గంటల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించే బాధ్యత హాస్పిటల్, కాలేజీ చీఫ్ దే బాధ్యత అంటూ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. 

కోల్ కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ విధంగా బెంగాల్ లోని ఆర్ జీ కర్ ఆసుపత్రిలో కొందరు ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఆసుపత్రిలో పలు వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

  వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రయోజనాలే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర వైద్యసిబ్బందిపై దాడులు సర్వసాధారణంగా మారాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు. విధుల్లో ఉండగా.. సిబ్బందిపై లేదా ఆసుపత్రిపై దాడులు జరిగితే ఆరు గంటల్లోనే ఎఫ్ ఐఆర్ నమోదు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.