
ఆమనగల్లు, వెలుగు: చిరు ధాన్యాలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఐసీడీఎస్ సీడీపీవో శాంతిరేఖ తెలిపారు. శుక్రవారం కడ్తాల్ మండలం రావిచెడ్, మద్దెలకుంట తండా, తలకొండపల్లి మండలం చౌదర్పల్లి అంగన్వాడీ సెంటర్లలో పోషణ పక్షం నిర్వహించారు. తల్లులకు చిరు ధాన్యాలు, పోషకాహారంపై అవగాహన కల్పించి వాటి ప్రయోజనాలను వివరించారు. తల్లిపాల విశిష్టత, రక్తహీనతపై అవగాహన కల్పించారు. చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించి తల్లులు తమతో పాటు పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. సూపర్వైజర్లు శబరి, తిరుమల, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.