
- రాజేంద్రనగర్ ఓల్డ్ వెటర్నరీ కాలేజీ సెంటర్‌లో దందా
శంషాబాద్, వెలుగు: కేంద్రం కరోనా వ్యాక్సిన్ప్రజలకు ఫ్రీగా వేస్తుంటే, రాజేంద్రనగర్ పరిధిలోని ఓ సెంటర్‌లో ప్రైవేటు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. సర్కిల్ లోని ఓల్డ్ వెటర్నరీ కాలేజ్ సెంటర్ లో కొద్దిరోజులుగా వ్యాక్సినేషన్కొనసాగుతోంది. రోజుకు 400 మంది దాకా వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. సెంటర్ లో ప్రైవేట్ వ్యక్తులు కూర్చుని వ్యాక్సిన్రిజిస్ట్రేషన్ కోసమని రూ. 30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో వ్యాక్సిన్ కోసం వచ్చిన జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.