సెప్టెంబర్ 22న హెల్త్​స్టాఫ్​ ఆందోళనలు

సెప్టెంబర్ 22న హెల్త్​స్టాఫ్​ ఆందోళనలు

కరోనా వచ్చినా సరైన ట్రీట్​మెంట్​ ఇస్తలేరు

మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు

హైదరాబాద్, వెలుగు: కరోనా టైంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న హెల్త్​ స్టాఫ్​పట్ల సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న హెల్త్​డిపార్ట్​మెంట్​కు చెందిన అన్ని ఆఫీసుల్లో నిరసనలు చేపడతామని యూనియన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్ ,యాదానాయక్ శనివారం ప్రకటించారు. కరోనా సోకిన హెల్త్​ స్టాఫ్​కు సరైన ట్రీట్​మెంట్​ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా చనిపోయిన స్టాఫ్​కు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. జీతాలు పెంచుతామని, డైలీ ఇన్సెంటివ్ ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ అమలు చేయడం లేదని.. దీనిపై అధికారులను అడిగితే మంత్రి, సీఎం పేర్లు చెప్పి తప్పించుకుంటున్నారని చెప్పారు. కాంట్రాక్టు, పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామన్న సర్కారు.. కోర్టు కేసుల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్, స్వీపింగ్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వ జీవోలు, కార్మిక శాఖ జీవోలు అమలు కావటం లేదని వాపోయారు. కరోనాతో చనిపోయిన స్టాఫ్​కు అసెంబ్లీలో నివాళులు అర్పించకుండా సర్కారు అవమానించిందన్నారు.

For More News..

రోడ్డు మధ్యలో మంత్రి ప్రోగ్రాం.. దారి మళ్లిన అంబులెన్స్

రెండున్నరేళ్ల కిందటి ‘రైతుబంధు’ ఇప్పుడిచ్చిన్రు

పనికిమాలిన చట్టాన్ని మార్చాలె: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

మూడెకరాల స్కీమ్‌‌కు ఫుల్ స్టాప్​ పెట్టిన కేసీఆర్