Health Tip : ట్రాఫిక్ లో కారులో ఈ చిన్న చిన్న ఎక్సర్ సైజ్ చేయండి.. మంచి రిలాక్స్..!

Health Tip : ట్రాఫిక్ లో కారులో ఈ చిన్న చిన్న ఎక్సర్ సైజ్ చేయండి.. మంచి రిలాక్స్..!

ఎక్సర్ సైజ్ చెయ్యాలని అందరికీ ఉంటది. కానీ, ఉద్యోగం, ఇంటిపనులతో ఏమీ చెయ్యలేని పరిస్థితి, అందుకే రోజూ ప్రయాణం చేసేటప్పుడు ఎక్సర్ సైజ్లు చేస్తే.. టైంతో పాటు, ఆరోగ్యం రెండూ కలిసి వస్తాయ్ అంటున్నరు ఫిట్నెస్ నిపుణులు. రోజూ ప్రయాణంలో కూర్చొవడం వల్ల వెన్ను, మోకాలి సంబంధిత జబ్బులు వస్తయ్. అయితే, డ్రైవింగ్ సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే... హెల్దీగా ఉండొచ్చు. కారులో ప్రయాణించే వారికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడ్తాయ్.

సిగ్నల్ పడినప్పుడు వెహికిల్ ఆగిన కొన్ని నిమిషాలు అయినా.. చిన్న ఎక్సర్ సైజ్ లు చేసినా ఎంతో మేలు కలుగుతది. ఆ టైంలో కాళ్ళను గట్టిగా బిగించండి. ఆ తర్వాత మోకాళ్ళపై అరచేతులను ఉంచి కొంచెం ముందుకు బెండ్ కావాలె. కాళ్ళను బిగించినప్పుడు కండరాలు గట్టి పడటాన్ని గమనించొచ్చు. ఊపిరి గట్టిగా పీల్చి.. పది సెకన్లు అలాగే ఉండాలె. తర్వాత ఊపిరి వదులుతూ కాళ్ళను రిలాక్స్ చెయ్యాలె. ఇలా గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఐదు నుంచి పది సార్లు చేయొచ్చు.

ఇది వెన్ను, కాళ్లకు మేలు చేస్తది. చాలా మంది డ్రైవింగ్ సీటులో కూర్చున్నప్పుడు ముందుకు వంగినట్టు కూర్చుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మరో సిగ్నల్ పడినప్పుడు.. ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా సీటు వెనుకభాగాన్ని వీపు, భుజాలతో గట్టిగా నొక్కాలి. పది సెకన్ల తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఇలా చెయ్యడం పొట్ట కండరాలలో పేరుకున్న కొవ్వు కరుగుతది.

ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తల, మెడ నిటారుగా ఉండేలా జాగ్రత్త పడాలి. దొరికిన సమయాన్ని బట్టి ఇలా పది సార్లు చెయ్యొచ్చు. ఇవే కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి చేసే ప్రాణాయా మం ఏ సిగ్నల్ దగ్గర ఆగినా కొద్దిసేపు చే యవచ్చు. వీటి వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.