Health Tip : మంచినీళ్లు ఎక్కువగా తాగితే ఏమవుతుంది..?

Health Tip : మంచినీళ్లు ఎక్కువగా తాగితే ఏమవుతుంది..?

ఏ విషయమైనా చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేస్తే కష్టమే. అలానే తాగాల్సిన దానికంటే ఎక్కువ నీళ్లు తాగినా కూడా ముప్పే అంటున్నారు డాక్టర్లు. రోజుకు కనీసం 3 - 4 లీటర్లు తాగాలి. కానీ కొందరు ఎక్కువగా తాగుతారు. అలా ఎక్కువగా నీళ్లు తాగితే సమస్యలు వస్తాయట.

  • యూరిన్ కలర్ని బట్టి మనం ఎన్ని నీళ్లు తాగుతున్నామో అర్థం అవుతుంది. యూరిన్ కలర్ డార్క్ ఎల్లోలో ఉంటే కావాల్సినన్ని నీళ్లు తాగడం లేదని, డీ హైడ్రేషన్ అయిందని, లైట్ ఎల్లో కలర్లో ఉంటే కావాల్సినన్ని నీళ్లు తాగుతున్నట్లు. ట్రాన్స్పరెంట్ వస్తే ఓవర్ హైడ్రేషన్ అయినట్లు.
  • రోజుకు కనీసం 6 - 8 సార్లు యూరిను వెళ్లాలి. అంతకంటే ఎక్కువసార్లు వెళ్తే అది ఓవర్ హైడ్రేషన్కు సూచన.
  • నీళ్లు ఎక్కువగా తాగితే రక్తంలోని సోడియం నిల్వలు బాగా తగ్గిపోతాయి. దీంతో నీరసంగా, తొందరగా అలసిపోతారు. విపరీతమైన తలనొప్పి, వాంతులు, డయేరియా లాంటి సమస్యలు వస్తాయి.
  • శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను మెయింటెయిన్ చేసేందుకు నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటే మనం ఎనర్జిటిక్ గా ఉంటాం. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల వాటి బ్యాలెన్స్ తప్పుతుంది. పాదాలు, చేతులు, పెదాలు ఉబ్బుతాయి. కాళ్లు, చేతులు వణకడం. బాడీ బ్యాలెన్స్ తప్పడం లాంటివి ఉంటే కచ్చితంగా మనం తాగే నీళ్ల శాతం ఎక్కువై నట్లే. దానివల్ల కండరాల నొప్పులు వస్తాయి.