హెల్త్ కేర్ కోసం ఆడవాళ్లు ఈ మూడు టిప్స్ ఫాలోకండి

హెల్త్ కేర్ కోసం   ఆడవాళ్లు ఈ మూడు టిప్స్ ఫాలోకండి

మీకోసం మీరు.. 

ఇంట్లో ఆడవాళ్లు అనారోగ్యం బారిన పడితే తన వాళ్లకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేరు. వాళ్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినప్పుడు ఫిజికల్, మెంటల్, ఎమోషనల్​గా ప్రిపేర్‌‌‌‌ అవ్వగలుగుతారు. అలా ఉండాలంటే సెల్ఫ్ కేర్ మీద ఎక్కువ దృష్టిపెట్టాలి. దానివల్ల ఓవరాల్​ హెల్త్ బాగుంటుంది. 

ఆహారమే అమృతం!

పోషకాహారం ఆరోగ్యానికి మొదటి మెట్టు. సమతుల్య ఆహారం అనేది ఫిజికల్​గానే కాదు మెంటల్​ హెల్త్​కి కూడా ఉపయోగపడుతుంది. టైంకి తినే అలవాటు ఉన్నవాళ్లలో పోషకాల పనితీరు బాగుంటుంది. రోజంతా చేసే పనుల్లో యాక్టివ్​, ఎనర్జిటిక్​గా ఉండేందుకు హెల్ప్ అవుతుంది.

నేచర్​తో కనెక్ట్​ అయ్యేలా..

ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్​లో వర్కవుట్లు చేయడం మాత్రమే అనుకుంటే పొరపాటు. అవుట్​ డోర్ యాక్టివిటీలు, సోషల్ గేదరింగ్స్, వాకింగ్ వంటి నేచర్​తో కనెక్ట్ అయ్యేలా ఉండాలి. సూర్యకాంతిలో కాసేపు ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది. డి – విటమిన్​ లెవల్స్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అది ఎముకల బలానికి, ఇమ్యూనిటీకి మేలు చేస్తుంది.