భారతీయ వంటకాల్లో ఘాటు అనేది కామన్. అయితే ఈ ఘాటు ఇప్పటిది కాదు. మిర్చి, మిరియాలు పుట్టకముందు నుంచే ఇక్కడి వంటలు ఘాటుగా ఉండేవి. అదెలా అనుకుంటున్నారా. అప్పట్లో పెప్పర్ కు పదింతలు ఘాటు ఉండే పిప్పలి ఉండేది. ఇది కేవలం స్పైస్ మాత్రమే కాదు, సూపర్ ఫుడ్ కూడా. డయాబెటిస్, డైజెషన్, లంగ్ ఇన్ఫెక్షన్ల లాంటి ఎన్నోరకాల సమస్యలకు దీంతో చెక్ పెట్టొచ్చు.
పిప్పలిని లాంగ్ పెప్పర్ అంటారు. ఎంతో ఘాటుగా ఉండే ఇది. శ్వాస ఇన్ ఫెక్షన్లు, బ్రాంకైటిస్, జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి వాటికి మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంతేకాదు, నొప్పులను తగ్గించి, వాతాన్ని నయం చేస్తుంది. ఆడవాళ్లలో మెనుస్ట్రువల్ సమస్యలకు కూడా ఇది మంచి మెడిసిన్.
ఒక టీ స్పూన్ పిప్పళ్ల చూర్ణాన్ని ప్రతి రోజూ వేడినీళ్లలో కలిపి తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. బెల్లంతో కలిపి తీసుకుంటే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
పిప్పలికి నాలుగు వేల ఏండ్ల చరిత్ర ఉంది. ఈశాన్య భారతదేశం, కేరళ, కర్నాటక, బెంగాల్ అడవుల్లో ఇది ఎక్కువగా పండేది. అప్పట్లో దీన్ని మిరియాల్లో ఒకరకం అనుకునేవాళ్లు. అందుకే దీన్ని పండించడంపై అంతగా ఫోకస్ పెట్టలేదు. దాంతో ఇప్పుడు దీనికి ఫుల్ డిమాండ్ పెరిగింది.