ముంబై : సెన్సెక్స్, నిఫ్టీ గురువారం సెషన్‌ను ఫ్లాట్‌గా ముగించాయి. ఎనర్జీ, మెటల్ షేర్లు పెరగగా, హెల్త్‌కేర్, ఐటీ షేర్లు పడ్డాయి. 30 షేర్లున్న సెన్సెక్స్ గురువారం 5 పాయింట్లు తగ్గి 66,018 దగ్గర సెటిలయ్యింది. కానీ, ఇంట్రాడేలో మాత్రం ఈ ఇండెక్స్ 200 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా ఓపెనింగ్ లాభాలను కోల్పోయి 19,802 దగ్గర సెటిలయ్యింది. ఈ ఇండెక్స్ 10 పాయింట్లు పడింది. గురువారం సెషన్ డల్‌గా మారిందని, ఇండెక్స్‌లు ఓపెనింగ్ సెషన్ లాభాలను తొందరగా కోల్పోయాయని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు ఎక్కువగా పడ్డాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతి ఎయిర్‌టెల్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్రాడ్ మార్కెట్ చూస్తే బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 0.44 శాతం పెరగగా మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం లాభపడింది. సెక్టార్ల పరంగా చూస్తే హెల్త్‌కేర్, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్
టెక్, క్యాపిటల్ గూడ్స్, పవర్ ఇండెక్స్‌లు నెగెటివ్‌లో కదిలాయి. రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, టెలీకమ్యూనికేషన్, మెటల్ ఇండెక్స్‌లు గ్రీన్‌లో ముగిశాయి. సియోల్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్‌లు లాభాల్లో క్లోజయ్యాయి. యూరోపియన్ మార్కెట్‌లు కొద్దిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 80.73 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 83.34 దగ్గర సెటిలయ్యింది.