హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై గురువారం ( జూలై 11) తెలంగాణ హైకోర్టు విచారణ చేప్టటింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేం దర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ ఎస్ నేతలు పిటిషన్ వేశారు. గురువారం హైకోర్టు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుముందు వాదనలు వినిపించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు .. తదుపరి విచారణను సోమవారానికి (జూలై 15, 2024కు )వాయిదా వేసింది.
పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే వివేకానంద న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కడియం శ్రీహరి, దానం నాగేదర్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లో చేరారని తెలిపారు.వీరిపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన చర్యలు తీసుకోలేదని, కోర్టు స్పందించి ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేలా చేయాలని వివేకానంద పిటిషన్ లో వెల్లడించారు.