గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు పై ఇవాళ(సెప్టెంబర్ 27) హైకోర్టులో విచారణ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Group1) ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ఇవాళ మరోసారి హైకోర్టు విచారించనుంది. బయోమెట్రిక్ నిబంధన అమలు చేసిన పరీక్షల వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. 

ALSO  READ :- పై ఆఫీసర్లకు నై.. ప్రజాప్రతినిధులకు జై .. వివాదాస్పదంగా ఖాకీల వైఖరి

నిన్న (సెప్టెంబర్ 26న) గ్రూప్ 1 పరీక్ష రద్దుపై విచారణ చేపట్టిన హైకోర్టు.. గ్రూప్ 1 పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారని టీఎస్ పీఎస్సీ కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అని మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, మరోసారి బయోమెట్రిక్ సమస్యతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది.