కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన గంగాజమున, శ్రీరామ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ జే.బీ.పార్దీవాలా బెంచ్ విచారణ జరిపింది. అయితే అత్యధిక మంది నిర్వాసితులు ఇప్పటికే పరిహారం తీసుకునేందుకు ఒప్పుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలతో వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణ జులై 18కి వాయిదా వేసింది.