తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ పై ఏప్రిల్ 8 వాదనలు వింటామని తదుపరి విచారణను వాయిదా వేసింది.
మరో వైపు ఇదే కేసులో రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాల్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్ స్టేషన్ లో డీసీపీ విజయ్ కుమార్ ,జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు. వేణుగోపాల్ రావును విచారించిన తర్వాత ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే భుజంగరావు, తిరుపతన్నలు ఏప్రిల్ 6 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు చంచల్ గూడ జైలులో ఉన్నారు.
వేణుగోపాల్ రావు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం వేణుగోపాల్ రావును ఎస్ఐబీలో అడిషనల్ ఎస్పీ(ఓఎస్డీ)గా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నియమించారు. ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావుతో కలిసి వేణుగోపాల్‌రావు కూడా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారు.