హైదరాబాద్, వెలుగు: అటవీశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. నాంపల్లి స్పెషల్‌కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో శుక్రవారం విచారణ జరగలేదు. కొండా సురేఖ తమ కుటుంబ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించారని నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
క్రిమినల్ చర్యలతోపాటు పరువుకు భంగం కలిగించినందుకు బీఎస్‌ఎస్356 కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్, సోషల్‌మీడియా లింక్స్ ను కోర్టుకు అందజేశారు. విచారణ అనంతరం తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.