
ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను 2023 నవంబర్ 30కి వాయిదా వేస్తు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సిల్క్ స్కామ్ కేసులో బాబు క్వాష్ పిటిషన్ విచారణలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది.
ఈ కేసు తర్వాతే ఫైబర్‌నెట్ కేసుపై విచారణ చేపడతామని వెల్లడించింది. ఫైబర్‌నెట్ కేసులో నవంబర్ 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. కాగా నవంబర్ 23న బాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పును దీపావళి తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.