లైంగిక వేధింపుల కేసు: జానీ బెయిల్ పిటిషన్‎పై విచారణ వాయిదా

లైంగిక వేధింపుల కేసు: జానీ బెయిల్ పిటిషన్‎పై విచారణ వాయిదా

రంగారెడ్డి: అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‎పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన లీడర్ జానీకి నిరాశ ఎదురైంది.ఈ కేసులో బెయిల్ కోసం జానీ దాఖలు చేసిన పిటిషన్‎పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. జానీ బెయిల్ పిటిషన్‎పై ఇవాళ (సెప్టెంబర్ 23) వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు.. తదుపరి విచారణను ఎల్లుండి (సెప్టెంబర్ 25)కి వాయిదా వేసింది. ఈ కేసులో జానీకి బెయిల్ వస్తుందా..? రాదా..? తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. 

ఇదిలా ఉంటే.. ఈ కేసులో కొరియోగ్రాఫర్ జానీని కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు జానీని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ పిటిషన్‎పైన ఇవాళ ఆర్గ్యూమెంట్స్ విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు.. కస్టడీ పిటిషన్‎పై తదుపరి విచారణ రేపటి (సెప్టెంబర్ 24)కి వాయిదా వేసింది. దీంతో కొరియోగ్రాఫర్‏పై లైంగిక వేధింపుల కేసులో జానీకి బెయిల్ వస్తుందా..? లేదా పోలీస్ కస్టడీకి వెళ్తారా అనే దానిపై సస్పె్న్స్ నెలకొంది. 

ALSO READ | జానీని వారం రోజులు అప్పగించండి.. కోర్టులో పోలీసుల కస్టడీ పిటిషన్

కాగా,  కొరియోగ్రాఫర్ జానీ తనను లైంగికంగా వేధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాని ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోక్సో యాక్ట్‎తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్‎కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జానీ చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.