ఏసీపీ ఉమమహేశ్వరావును కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు ఏసీబీ అధికారులు. 8రోజుల పాటు కస్టడికీ ఇవ్వాలని కోరారు. ఇవాళ కస్టడీ పిటిషన్ పై విచారణ చేయనుంది నాంపల్లి కోర్టు. ఇప్పటికే అవినీతి అక్రమాల కేసులో ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. బినామీ ఆస్తులు, వ్యాపారవేత్తలతో కలిసి పెట్టిన పెట్టుబడులపై విచారణ చేయనున్నారు. దర్యాప్తులో నిందితుడి ల్యాప్ ట్యాప్ కీలకం కానుంది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతని రెండు బ్యాంక్ లాకర్లను తెరవాలని భావిస్తున్నారు ఏసీబీ అధికారులు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకి చెందిన ఉమామహేశ్వర్‌రావు1995 బ్యాచ్ ఎస్‌ఐ. సిటీ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ కాలం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అబిడ్స్ పీఎస్‌లో విధులు నిర్వర్తించారు. ఓ కేసు దర్యాప్తులో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. రాచకొండ కమిషనరేట్‌పరిధి జవహర్‌నగర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ బాధిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఏసీపీగా విధులు నిర్వహించారు. ఇక్కడ కూడా సివిల్ వివాదాల్లో తలదూర్చారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఉమామహేశ్వర్ రావును సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సిటీ కమిషనరేట్‌పరిధిలోని సీసీఎస్‌లో ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.