కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై విచారణ వాయిదా

కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అంతకుముందు మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోర్టుకు తెలపకుండా మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఇంప్లీడ్ చేసింది. డివిజన్ బెంచ్ లో పార్టీ ఇన్ పర్సన్ గా కేఏ పాల్ వాదనలు వినిపించారు.

అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. గత నెలలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ను రూపొందించారని పాల్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు.