ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ ల బదిలీలను సవాల్ చేస్తూ క్యాట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించారు. DOPT (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) కౌంటర్ దాఖలు చేయలేదు. అయితే 7 గురు ఐఏఎస్ లకు వేర్వేరుగా కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని IASల తరుపు న్యాయవాదులు క్యాట్‌ను కోరారు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. వచ్చే విచారణకు 7 గురు IASలను ఏపీకి కేటాయింపుపై విడిగా కౌంటర్లు ఫైల్ దాఖలు చేయాలని DOPT ను CAT ఆదేశించింది.
డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేసిన ఐఏఎస్ అధికారులకు కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్ (క్యాట్) బిగ్ షాకిచ్చింది. డీవోపీటీ ఆదేశాలు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లు క్యాట్ తోసిపుచ్చింది. డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని ఐఏఎస్‌లకు తేల్చి చెప్పింది. డీవోపీటీ ఆదేశాలకనుగుణంగా ఏ స్టేట్ కేడర్ అధికారులు అక్కడి రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. ఐఏఎస్ అధికారుల పిటిషన్‌పై విచారణ సందర్భంగా క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు.. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని లేదా అని ఐఏఎస్ అధికారులను క్యాట్ ప్రశ్నించింది.
ALSO READ : 400 మందితో ఇంటరాక్షన్ : కులగణనపై చర్చకు రాహుల్
బోర్డర్లో సమస్యలు వస్తే వెళ్ళారా.. ఇంట్లో కూర్చొని సేవ చేస్తాం అంటే ఎలా అంటూ క్యాట్ నిలదీసింది. డీవోపీటీ వన్ మ్యాన్ కమిటీని వేసినప్పుడు ఎందుకు స్పందించలేదు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని ఐఏఎస్‌లను క్వశ్చన్ చేసింది. ఐఏఎస్‌ల కేడర్ కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అధికారం డీవోపీటీకి ఉందని ఈ సందర్భంగా క్యాట్ గుర్తు చేసింది. ఇరువర్గాల వాదనల అనంతరం డీవోపీటీ ఆదేశాలపై స్టే విధించేందుకు నిరాకరించిన క్యాట్.. ఎక్కడ కేడర్ అధికారులు అక్కడికి వెళ్లాల్సిందేనని తీర్పు వెలువరించింది.