జూబ్లీహిల్స్ కొండరాళ్ల బ్లాస్టింగ్పై హైకోర్టులో విచారణ

జూబ్లీహిల్స్ కొండరాళ్ల బ్లాస్టింగ్పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ సిటీలో జూబ్లీహిల్స్ కొండరాళ్ల బ్లాస్టింగ్పై హైకోర్టులో విచారణ జరిగింది. నివాస ప్రాంతాల్లో రాత్రి పగలనకుండా బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయని..చీఫ్ జస్టిస్ కు లెటర్ రాశారు హైకోర్టు జడ్జి నగేష్. లెటర్ను పిల్గా స్వీకరించిన హైకోర్టు బుధవారం (సెప్టెంబర్4) విచారణ చేపట్టింది. బ్లాస్టింగ్స్తో చుట్టుపక్కల నివసిస్తు న్నవారు  ఇబ్బందులకు గురవుతున్నారని జడ్జి నగేష్ లెటర్లో పేర్కొన్నారు.   

జూబ్లీహిల్స్లో కొండరాళ్ల బ్లాస్టింగ్ పై వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, భూగర్భగనులు, పర్యావరణశాఖ సెక్రటరీలకు నోటీసులు ఇచ్చింది. బ్లాస్టింగ్పై వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది.