Good Health : మీ గుండె బాగుండాలంటే.. ఈ ఫ్రూట్స్ తీసుకోండి.. గుండెపోటు తప్పించుకోండి..!

Good Health : మీ గుండె బాగుండాలంటే.. ఈ ఫ్రూట్స్ తీసుకోండి.. గుండెపోటు తప్పించుకోండి..!

ప్రతిరోజు పరగడుపున అరకప్పు బొప్పాయి ముక్కల్ని తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు యాపిల్ కూడా తీసుకుంటే మరింత ఆరోగ్యం చేకూరుతుందని చెబుతున్నారు. రోజులో ఏదో ఒక సమయంలో అరటిపండు తినడం కూడా మంచిది. అరటిలోని కెరోటినిన్ అనే పదార్ధం మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది.


అరటిపండు.. బొప్పాయి.. యాపిల్ తినడం వలన  గుండె ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. అలాగే చేపలు తినడం ద్వారా ఒమేగా 3 ఫ్యాట్స్ లభిస్తాయి. ఇవి గుండెపోటును అరికడతాయి. శరీరానికి కావాల్సిన నీటిని, పీచు పదార్ధాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

ALSO READ : Good Health : పిల్లల్లో అధిక బరువు చాలా డేంజర్.. జాగ్రత్తగా ఉండండి పేరంట్స్..!

 గుండెకు అవసరమయ్యే ఫైబర్, విటమిన్స్.. మినరల్స్ గోధుమల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెకు హాని కలిగించే కొవ్వును నివారిస్తుంది. ఫైబర్ కొవ్వుతో కలిసి దానిని బయటికి పంపించి వేస్తుంది.. ఇంకా ఫైబర్ దొరికే పదార్థాలలో ఓట్స్, బార్లీ, రాగి, జొన్నలాంటివి ముఖ్యమైనవి. ముఖ్యంగా అధిక కొవ్వు తగ్గించడంలో ఉల్లిపాయలు మంచి మందుగా పనిచేస్తాయి. అందుకే ఉల్లిపాయలు రోజువారీ ఆహారంలో ఉండేలా చూడాలి.

-వెలుగు,లైఫ్