నిమ్స్​లో 11 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు

నిమ్స్​లో 11 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు
  • డాక్టర్లను సత్కరించిన నిజాం ముని మనవడు 

పంజాగుట్ట, వెలుగు: నిమ్స్​లో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 209 మంది చిన్నారుల పేర్లు నమోదు చేసుకున్నారు. ఈనెల 23 నుంచి నిమ్స్​డైరెక్టర్​డాక్టర్​ఎన్.బీరప్ప పర్యవేక్షణలో యూకేలో స్థిరపడిన డాక్టర్​రమణ దన్నపునేని ఆధ్వర్యంలో స్పెషల్​డాక్టర్ల టీమ్​ఈ ఆపరేషన్లు చేస్తోంది. ఇప్పటివరకు 11 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేశారు. 

సోమవారం నాలుగు, మంగళవారం మూడు , బుధవారం నాలుగు ఆపరేషన్లను చేశారు. ఇందులో ఏడేండ్ల బాలుడు మణిదీప్​తో పాటు 9 నెలల బాబు కూడా ఉన్నాడు. మాతృదేశంపై మమకారంతో డాక్టర్​రమణ ఏటా హైదరాబాద్​వచ్చి నిమ్స్​డాక్టర్ల సహకారంతో పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న నిజాం ముని మనవడు నవాజ్​నజీఫ్​ఖాన్​బుధవారం నిమ్స్​ను విజిట్​చేశారు. 

మిలినియమ్​ బ్లాక్​లోని పీడియాట్రిక్​హార్ట్​విభాగాన్ని పరిశీలించి అక్కడ పిల్లలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. తర్వాత డాక్టర్ల బృందాన్ని సత్కరించి అభినందించారు.