
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విజయవాడ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసేందుకు మంగళవారం (ఫిబ్రవరి 18) జగన్ విజయవాడ వెళ్లారు. జగన్ విజయవాడ రావడంతో వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడి తరలివచ్చారు. జగన్ ఫ్యాన్ అయిన ఓ మైనర్ బాలిక కూడా తన అభిమాన నేతను కలిసేందుకు వచ్చింది. అయితే.. కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఆ బాలికకు జగన్ దగ్గరకు పోవడానికి వీల్లేకుండా పోయింది.
దీంతో ఆ బాలిక ‘‘జగన్ అన్నా’’ అంటూ గట్టిగా అరిచింది. ఇది గమనించిన జగన్ ఆ మైనర్ బాలికను దగ్గరకు ఆహ్వానించి.. ఆమె నుదిటిపై ముద్దుపెట్టి ఆశీర్వదించాడు. దీంతో భావోద్వేగానికి గురైన బాలిక తిరిగి జగన్ నుదిటిపై ముద్దుపెట్టి ఆప్యాయంగా అతన్ని కౌగిలించుకుంది. అనంతరం ఆ చిన్నారి జగన్తో సెల్ఫీ తీసుకుంది. ఇది చూసి అక్కడ ఉన్నవారంతా ఎమోషనల్ అయ్యారు.
చిన్నా పెద్ద అనే తేడా లేకుండా జగన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని.. జగన్పై ప్రజల్లో ఉన్న ప్రేమానురాగాలకు ఇదే నిదర్శనమని వైసీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతరం ఆ బాలిక మీడియాతో మాట్లాడుతూ.. జగన్ హయాంలో అందుబాటులో ఉన్న అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలులో లేవని, దీనివల్ల ప్రజల జీవితం కష్టతరంగా మారిందని చెప్పింది. ఇక, జగన్‌ను దగ్గరగా చూడాలనే కల నేరవేరిందని సంతోషం వ్యక్తం చేసింది ఆ మైనర్ బాలిక.