రతన్ టాటాకు ప్రియమైన కుక్క నివాళి..

రతన్ టాటాకు ప్రియమైన కుక్క నివాళి..

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా పెంపుడు కుక్క గోవా కూడా తన బాస్ కి అంతిమ నివాళులర్పించింది. గురువారం అక్టోబర్10న చివరిసారిగా రతన్ టాటాకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క గోవా నివాళుర్పించింది. హార్ట్ టచ్చింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కుక్క అంటేనే విశ్వాసానికి, నమ్మకానికి పేరు. ఒక్కసారి దానికి తిండిపెడితే చాలు జీవిత కాలం విశ్వాసం చూపుతుంది. అంతేకాదు కష్టసుఖాల్లో కూడా పాలుపంచుకుంటుంది. భావోద్యోగాలను వ్యక్తం చేస్తుంది.బుధవారం మరణించిన రతన్ టాటా భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ముంబైలోని NCPA లో ఉంచారు. రతన్ టాటాకు ఇష్టమైన పెంపుడు కుక్క గోవా అక్కడికి చేరుకుని నివాళులర్పించింది.జాతీయ జెండాతో కప్పబడిన రతన్ టాటా భౌతిక కాయాన్ని గుర్తించింది.మౌనంగా చూస్తూ ఉండిపోయింది. 

రతన్ టాటా తన కుక్కకు గోవా అని ఎందుకు పేరు పెట్టారంటే.. 

గోవా ..రతన్ టాటా కు ఇష్టమైన పెంపుడు కుక్క. రతన్ టాటా ఒకప్పుడు గోవా లో ఉన్నపుడు జరిగిన ఓ సంఘటన గోవాను రతన్ టాటాకు దగ్గర చేసింది. వీధుల్లో తిరుగుతున్న కుక్కను చేరదీసి అన్నం పెట్టాడు. బాస్ చూపిన ప్రేమకు గోవా ఫిదా అయిపోయింది. రతన్ టాటా వెంటే రావడం మొదలు పెట్టింది. క్యూట్ గా ఉన్న ఆ కుక్కను రతన్ టాటా దత్తత తీసుకొని పెంచుకున్నాడు. అప్పటినుంచి ఆ కుక్కకు గోవా అని పేరు పెట్టారు.