అయ్యోపాపం: సంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన

అయ్యోపాపం: సంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన
  • అనారోగ్యంతో కొడుకు మృతి .. దాతల సాయంతో అంత్యక్రియలు
  • సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో కలచివేసిన ఘటన

పటాన్​చెరు(గుమ్మడిదల),వెలుగు:  చేతికొచ్చిన కొడుకు అనారోగ్యంతో మృతిచెందడంతో అంత్యక్రియలు చేసేందుకు చేతిలో పైసా లేకపోవడంతో తల్లి రోదన స్థానికులను కలచివేసింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన చిత్తారి మహేశ్(18) కొన్ని రోజులుగా అనారోగ్యంతో  చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. 

 అతని తండ్రి మూడేండ్ల కిందటే మృతిచెందగా.. తల్లి శాంతమ్మ కూలీ పని చేస్తూ కొడుకుకు చికిత్స చేయిస్తుంది. ఒక్కగానొక్క కొడుకు కూడా మృతి చెందడంతో తల్లి  రోదించిన తీరు కంటతడి పెట్టించింది. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో సాయం కోసం వేడుకుంది. శాంతమ్మ దీనస్థితిని చూసి గుమ్మడిదలకు చెందిన సీజీఆర్​ట్రస్ట్​నేత గోవర్ధన్​రెడ్డి రూ.10 వేలు, కాంగ్రెస్ నేత నరేందర్​రెడ్డి రూ.5 వేలు, మరికొందరు తమకు తోచినంత అందించారు. అనంతరం ఆమె కొడుకు అంత్యక్రియలను పూర్తి చేసింది.