తల్లి ప్రేమ ఎంత గొప్పది..మనుషుల్లోనే కాదు..జంతువుల్లో కూడా అది పుష్కలంగా దొరుకుతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఆ పసికూనలకు తల్లి దగ్గరుండి ఆనందాన్ని పంచుతుంది. పుట్టిన తర్వాత తొలిసారి వర్షాన్ని చూసిన ఆ కూనలు ఆడుతూ, దుంకుతూ, పొర్లుతూ ఎంతో ఆనందం తో పరుగులు పెడుతుంటే.. తల్లి చిరుత వాటికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఓ కంట కనిపెడుతూనే తన చిన్ని చిన్న కూనలతో కలిసి ఆటలో మునిగిపోయింది. మధ్య ప్రదేశ్ లో కునో నేషనల్ పార్కులో దక్షిణాప్రికా చిరుత గామిని ఇటీవల పుట్టిన తన కబ్స్ తో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.. వివరాల్లోకి వెళితే..
ఈ వీడియోలో తల్లి చిరుత గామిని తన ఐదు కూనలతో వర్షంలో తడుస్తూ పిల్లలకు ఆనందాన్ని పంచుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోను కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ X లో షేర్ చేశారు. గామిని తన ఐదు కూనలు వర్షంలో ఎగురుతూ, దుంకుతూ, పొర్లుతూ ఎంజాయ్ చేస్తుంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అన్ని ఓ కంట కనిపెడుతూనే పిల్లల ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు గామిని, దాని పిల్లల ఎంజాయ్ మెంట్ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
గామిని ఆడ చిరుత దక్షిణాఫ్రికాలోని కలహారి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చారు. ఐదు సంవత్సరాల వయసున్న గామిని దక్షిణాఫ్రికానుంచి తెచ్చిన మొదటి చిరుత. గామిని 2024 మార్చి అంటే ఈ ఏడాది మార్చిలో ఐదు బుజ్జి చిరుత కూనలకు జన్మనిచ్చింది. గామిని పిల్లల పుట్టుకతో భారతదేశంలో జన్మించిన మొత్తం చిరుత పిల్లల సంఖ్య 13కి పెరిగింది. 2024 జనవరిలో నమీబియా చిరుత జ్వాలా కూడా కునో నేషనల్ పార్కులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. గామిని ఐదు పిల్లల జననంతో కునో నేషనల్ పార్కుల చిరుత జనాభా పెంచేందుకు దోహదపడ్డాయి. అంతరించి పోతున్న చిరుత జాతిని పెంచేందుకు 2022లో నమీడియా నుంచి ఎనిమిది చిరుతలు, ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను మార్చి, పిబ్రవరిలో 2023లో కునో షనల్ పార్కులో వదిలారు.
గామిని లాంటి చిరుతులకు మంచి వాతావరణాన్ని అందించిన కునో నేషనల్ పార్కు సిబ్బందికి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ అభినందనలు తెలిపారు. చిరుతలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించారు. చిరుతలకు ఒత్తిడి లేని వాతావరణం, మేటింగ్, పిల్లల పుట్టుక మంచి వాతావరణం కల్పించినందుకు అటవీ అధికారులు, వెటర్నరీ బృందం, ఫీల్డ్ సిబ్బందికి అభినందనలు అంటూ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు.
అయితే ఈవిజయాలు సాధించనప్పటికీ ఓ చిరుత మరణంతో ప్రాజెక్టు సవాళ్లను ఎదుర్కొంది. 2024 జనవరిలో నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో ఏడు పెద్దచిరుతలు, మూడు పిల్లలు చనిపోయాయి.