- 7 ప్రాంతాల్లో ఉన్నట్టు తేల్చిన ‘హైదరాబాద్ అర్బన్ ల్యాబ్’ రీసెర్చర్లు
- పటాన్చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌పల్లి,
- బీఎన్‌రెడ్డి నగర్, మన్సూరాబాద్,
- హయత్‌నగర్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు
- ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల దాకా
- పెరిగిపోతున్న కాంక్రీట్ నిర్మాణాలు, పొల్యూషన్ ఎఫెక్ట్
- చెట్లు కొట్టేయడంతో పెరుగుతున్న వేడి.. పేదలపైనే ప్రభావం
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు ఎండాకాలంలో రాష్ట్రమంతా మండిపోతే హైదరాబాద్ సిటీలో మాత్రం అందుకు భిన్నంగా వాతావరణం కూల్‌గా ఉండేది. కారణం దక్కన్ పీఠభూమి మీద ఎత్తులో ఉండడమే. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత ఎత్తు మీదున్నా వేడి విపరీతంగా పెరిగిపోతున్నది. అంతేకాదు.. సిటీలో ఏకంగా ‘హీట్ఐలాండ్స్’ పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ‘హైదరాబాద్అర్బన్ల్యాబ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైంది. ఈ సంస్థకు చెందిన రీసెర్చర్లు శబరినాథ్, మేఘన.. ఈ ఏడాది మార్చిలో నమోదైన టెంపరేచర్లను లెక్కించి హీట్ఇండెక్స్ను తయారు చేశారు.
తద్వారా ఎక్కువగా వేడి నమోదవుతున్న ప్రాంతాలకు ‘అర్బన్ హీట్ఐలాండ్స్’ అని పేరు పెట్టారు. ల్యాండ్సర్ఫేస్టెంపరేచర్స్(భూఉపరితలం మీద రెండు మూడు మీటర్ల ఎత్తులో నమోదయ్యే ఉష్ణోగ్రతలు) లెక్కించడం ద్వారా ఈ హీట్అర్బన్ ఐలాండ్స్‌ను గుర్తించారు. ల్యాండ్శాట్శాటిలైట్డేటా ఆధారంగా టెంపరేచర్లను లెక్కించి.. గూగుల్ ఎర్త్ఇంజిన్ ద్వారా హీట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మార్క్ చేశారు. సిటీకి నలుమూలలా ఈ హీట్ ఐలాండ్స్ఉన్నట్టు తేల్చారు. సిటీలోని ఏడు ప్రాంతాలు పటాన్చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌పల్లి, బీఎన్‌రెడ్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్ హీట్ఐలాండ్స్గా మారినట్టు గుర్తించారు. ఆయా రీజియన్ల పరిధిలో టెంపరేచర్లు.. చుట్టుపక్కల ప్రాంతాల కన్నా తీవ్రంగా నమోదవుతున్నట్టు కనుగొన్నారు.
హీట్ఐలాండ్స్ ఏర్పడడానికి కారణమేంటి?
సిటీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంక్రీట్ మయమైపోతున్నది. చెట్లను కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మౌలిక వసతులపెరుగుదలతో పాటే టెంపరేచర్లు ఎక్కువవుతున్నాయి. పెద్దపెద్ద బిల్డింగులు, పక్కా ఇండ్లు, కాంక్రీట్ రోడ్లు, బీటీ రోడ్లతో సూర్యుడి వేడి ఎక్కువగా వాతావరణంలోకి అబ్సార్బ్ అవుతున్నట్టు శబరినాథ్, మేఘన వివరించారు.
ఇండ్లలో సౌకర్యం కోసం వాడుతున్న ఏసీలు, ఫ్రిజ్లతోనూ సర్ఫేస్ టెంపరేచర్లు పెరిగి హీట్ఐలాండ్స్గా మారుతున్నట్టు చెప్పారు. వాహనాలు పెరిగిపోవడం, సిటీలో టెంపరేచర్లు 43 నుంచి 44 డిగ్రీల మధ్యే నమోదవుతున్నా.. ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు మాత్రం 48 నుంచి 49 డిగ్రీలుగా ఉంటున్నట్టు గుర్తించామని శబరినాథ్ తెలిపారు. చెట్లను కొట్టేయడం, కాంక్రీట్నిర్మాణాలను చేపట్టడం, డార్క్ ఆబ్జెక్ట్స్ వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నట్టు వివరించారు. ఇక, దీనివల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నది పేద, మధ్యతరగతి ప్రజలేనని మేఘన చెప్పారు.
రేకుల షెడ్లు, బస్తీల్లో ఇరుకిరుకు ఇండ్లలో ఉండే మార్జినల్ పబ్లిక్ తీవ్రంగా సఫర్ అవుతున్నట్టు తెలిపారు. పక్కా ఇండ్లు కట్టుకున్నవాళ్లతో పోలిస్తే రేకుల ఇండ్లలో ఉంటున్న బస్తీవాసులు, ఇతర మార్జినలైజ్డ్ పబ్లిక్కు ఎండ వేడితో అల్లాడుతున్నట్టు చెప్పారు. రేకుల ఇండ్లలో టెంపరేచర్లు విపరీతంగా నమోదవుతున్నట్టు గుర్తించామన్నారు. ఈ సర్ఫేస్ టెంపరేచర్ల వల్లే వడగాలుల తీవ్రత కూడా పెరుగుతున్నదని, సాయంత్రానికి గాలులు చల్లబడుతున్నా అప్పటికే భూమిలో అబ్జార్బ్ అయిన వేడి రాత్రిపూట బయటకు వస్తున్నదని వారు వివరిస్తున్నారు. దీనిని నివారించాలంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. వాహనాల నుంచి వచ్చే ఎమిషన్స్నూ తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
ఏంటీ అర్బన్హీట్ఐలాండ్స్?
ఎండాకాలంలో టెంపరేచర్లు పెరగడం కామనే. అయితే, అసాధారణ రీతిలో పెరిగితే మాత్రం ప్రమాదం. ఇప్పుడు సిటీలో ఇలాగే అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇలా టెంపరేచర్లు పెరిగి మండుతున్న ప్రాంతాలనే ‘అర్బన్హీట్ఐలాండ్స్’ అని పిలుస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకూ ఎండ వేడికి ఇవి కేంద్రంగా ఉంటాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే టెంపరేచర్లు తరచూ అధికంగా నమోదవుతుంటాయి. అందుకే వీటిని హీట్ఐలాండ్స్ అని అంటున్నారు.