Weather Report: ఎండ మండుతోంది... సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు..

వేసవి కాలం ముందే వచ్చింది. గతేడాది (2023)  అక్టోబర్ వరకూ వర్షాలు కురవగా.. ఇప్పుడు వేసవి కాలం ముందుగానే మొదలైంది. మార్చిలోనే  ఎండలు మండుతున్నాయి.  వచ్చే రోజుల్లో  ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ( 2024)  మార్చి రెండో వారంలోనే దాదాపు 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు ఉష్ణోగ్రత 42  డిగ్రీలు కాగా.. అత్యధికం 44 డిగ్రీల రికార్ అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో  పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44  డిగ్రీల వరకు నమోదయ్యాయి. తూర్పు, ఈశాన్య దిశ‌ల‌నుంచి  వేడి గాలులు వీస్తు‌న్నా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. హైద‌రా‌బా‌ద్‌లో ఉష్ణోగ్రతలు పెరిగి పగటి పూట ప్రజలు ఉక్కపోతకు గుర‌వు‌తు‌న్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరు‌గు‌తా‌యని వాతావరణశాఖ అధి‌కా‌రులు తెలిపారు.హైదరాబాద్​ లో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. .రాత్రి వేళల్లో 22 డిగ్రీల వరకు ఉష్టోగ్రత ఉంటుంది.  ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో వేడి పెరిగింది. మార్చి లోనే ఎండలు ఇలా మండుతుంటే.. ఇక నడి వేసవి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. 

సూర్యతాపానికి ప్రజలు అల్లాడు తున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండవేడి మరింతగా పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాతావారణ శాఖ జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. 

 తెలంగాణ, ఏపీలో రానున్న 5 రోజులు వాతావరణ పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 5 రోజులు ( ఏప్రిల్​ 24 నుంచి)  గరిష్ణ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని ప్రకటించింది.  రెండు, మూడు  రోజులుగా కాస్త కూల్ అయిన సూర్యుడు(Summer Heat)...ఏప్రిల్​ 23  నుంచి మళ్లీ విజృంభిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పగటి పూట ఉష్ణోగ్రతలు(Temperatures Rises) పెరుగుతున్నాయి. మార్చి మొదటి నుంచి ఉష్టోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఏడాది తరహాలో ఈసారి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ కేంద్రాలు(IMD) హెచ్చరిస్తు్న్నాయి. తెలంగాణలో ఏప్రిల్​ 23  నుంచి  ఐదు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

వచ్చే 5 రోజులు ఎండలు

తెలంగాణలో(Telangana Weather) మార్చి నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సగటున ఉష్ణోగ్రత 42  డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయి.  దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపు దిగువ స్థాయిగా  వేడి గాలులు వీస్తున్నట్లు పేర్కొంది.  ఉదయం 10 గంటలకే అధిక ఉష్ణోగ్రత నమోదు అవు తోంది. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. విపరీతమైన వేడి కారణంగా అత్యవసరమైతే తప్ప, జనం ఇళ్లుదాటి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అదికూడా చెట్లనీడను ఆశ్రయిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. చిరు వ్యాపారులు మధ్యాహ్నం సమయంలో దుకాణాలు మూసి ఉంచుతున్నారు. మధ్యాహ్న సమయాల్లో ప్రజలు అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తు్న్నారు. వ. రాత్రి పూట సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఎండలో బయటకు వెళ్తే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలో పొడి వాతావరణం

ఏపీలో(AP Weather)  మరో ఐదు రోజులు( ఏప్రిల్​ 24 నుంచి)  పొడి  వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని  ఉంటాయని పేర్కొంది. అయితే నేటి నుంచి రానున్న 5 రోజు వెదర్ రిపోర్టును వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, దక్షిణ కోస్తాలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదని పేర్కొంది. వచ్చే ఐదు రోజులు రాయలసీమ(Rayalaseema Weather) జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఒకటి రెండు చోట్ల అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని తెలిపింది.