పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఊహించని సంఘటనలు జరగడం మామూలే. ఎక్కడా జరగని వింతలన్నీ ఈ లీగ్ లోనే జరుగుతాయి. ఆట దగ్గర నుంచి ఆటగాళ్ల ప్రవర్తన వరకు ఎక్కడా చూడని సంఘటనలు జరుగుతాయి. తాజాగా నిన్న (మార్చి 12) ఒక సంఘటన జరిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాసన్ రాయ్ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భాగంగా నిన్నక్వెట్టా గ్లాడియేటర్స్ ,ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. క్వెట్టా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జాసన్ రాయ్ హద్దు మీరు ప్రవర్తించాడు. ప్రత్యర్థి ప్లేయర్ ఇఫ్తికార్ అహ్మద్ కు కాలు చూపిస్తూ కయ్యానికి కాలు దువ్వాడు. లక్ష్య ఛేదనలో 3వ ఓవర్‌లో ముల్తాన్ సుల్తాన్స్ పేసర్ డేవిడ్ విల్లీ వేసిన తొలి బంతికి రాయ్ ఎల్‌బీడబ్ల్యూతో రూపంలో ఔటయ్యాడు. అంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత DRS తీసుకోవాలా వద్దా అని చర్చించడానికి రాయ్ తన బ్యాటింగ్ పార్ట్ నర్ సౌద్ షకీల్ వైపు వెళ్తున్నాడు.
వికెట్ పడిన ఆనందంలో ఇఫ్తికార్ అహ్మద్ సెలెబ్రేషన్ చేసుకోవడానికి ఆటగాళ్ల దగ్గరకు వెళ్లే సమయంలో రాయ్ తో ఏదో అన్నాడు. ఇఫ్తికార్ ఏమ్మన్నాడో గానీ రాయ్.. అహ్మద్‌తో గొడవకు దిగాడు. కాలు చూపిస్తూ ఏదో సైగ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం తార స్థాయికి చేరుకుంది. ఇంతలో ముల్తాన్ ఆటగాళ్లు వచ్చి వీరిద్దరినీ వేరు చేశారు. ఈ లోపు సమయం ముగియడంతో రాయ్ డీఆర్‌ఎస్ తీసుకోలేకపోయాడు. దీంతో మూడు పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్స్ 79 పరుగుల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్ పై భారీ విజయం సాధించింది.
Ugly Moment between Jason Roy and Iftikhar Ahmed.pic.twitter.com/5RYOCfFW19
— CricketGully (@thecricketgully) March 13, 2024